![]() |
![]() |

`రన్ రాజా రన్` (2014)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక.. సీరత్ కపూర్. మొదటి ప్రయత్నంలోనే మురిపించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆపై `టైగర్`, `కొలంబస్`, `రాజు గారి గది 2`, `ఒక్క క్షణం`, `టచ్ చేసి చూడు` చిత్రాలతో అలరించింది. అలాగే రీసెంట్ గా `కృష్ణ అండ్ హిజ్ లీల`, `మా వింత గాథ వినుమా` వంటి ఓటీటీ మూవీస్ తో ఎంటర్ టైన్ చేసింది.
ఇదిలా ఉంటే.. సీరత్ త్వరలో ఓ బాలీవుడ్ మూవీలో సందడి చేయనుంది. నజీరుద్దీన్ షా, తుషార్ కపూర్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులతో కలిసి `మారిచ్` అనే హిందీ చిత్రంలో నటిస్తోంది మిస్ కపూర్. ఇందులో అభినయానికి అవకాశమున్న పాత్రలో ఆమె దర్శనమివ్వనుంది. కాగా.. హిందీ చిత్ర పరిశ్రమలో సీరత్ కి ఇదే తొలి సినిమా కాదు. ఇదివరకు ఆమె `జిద్` (2014)లో నటించింది. మన్నారా చోప్రా, శ్రద్ధా దాస్ మెయిన్ లీడ్స్ గా చేసిన ఈ సినిమాలో సీరత్ ది సైడ్ రోల్. కట్ చేస్తే.. ఏడేళ్ళ తరువాత ఇప్పుడు చేస్తున్న మర్డర్ మిస్టరీ `మారిచ్`లో ఈ అమ్మడు మెయిన్ రోల్ చేస్తోంది. మరి.. ఈ బాలీవుడ్ మూవీ సీరత్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
![]() |
![]() |